రేపు దొంగతూర్థి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం

ఇన్చార్జి తహసిల్దార్ ఉదయ్ కుమార్ ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని దొంగతుర్తి గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటలకు పౌరహక్కుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ధర్మారం ఇన్చార్జి తహసిల్దార్ ఉదయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అంటరానితనం రెండు గ్లాసుల విధానం పై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని కుల సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.

వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం – శ్రీ చంద్రశేఖర్ జీ ధర్మారం (తెలంగాణ వాణి) వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ పెద్దపల్లి జిల్లా బౌద్ధిక ప్రముఖ్ తీర్పాటి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ ఎస్ ధర్మారంశాఖ ఆధ్వర్యంలో స్థానిక వైశ్యభవన్ లో విజయదశమి ఉత్సవం జరిగింది. కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా […]