UPDATES  

లక్ష్మీదేవిపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

లక్ష్మీదేవిపల్లిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా మాజీ సర్పంచ్ తాటి పద్మ ఆద్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ మేరకు మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ప్రకృతితో మమేకమై సంతోషంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ప్రజలు యువతి యువకులు అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాటి పద్మ, మాడిశెట్టి పద్మ,అనిత,అంగన్వాడి టీచర్ అంజమ్మ,స్థానిక మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల

హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణలో పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు భారీగా రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జి.ఓ నెం.9ను శుక్రవారం విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఉదయం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల […]

ఘనంగా ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి వేడుకలకు మేడారం మాజీ ఫ్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ లు గుర్రం మోహన్ రెడ్డి పాలకుర్తి రాజేశం గౌడ్ అల్వాల రాజేశం హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. […]

పూర్తిస్థాయిలో భాజపా మండల కమిటీ నియామకం : సతీష్ రెడ్డి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొమ్ము రాంబాబు దేశాల మేరకు శుక్రవారం భారతీయ జనతా పార్టీ ధర్మారం మండల శాఖ కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో నియమించినట్లు ఆ శాఖ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి విలేకరులకు తెలిపారు. మండల ఉపాధ్యక్షులుగా కర్రే లక్ష్మణ్, […]