UPDATES  

పర్యావరణ పరిరక్షణకై ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వామిత్ర చౌహన్

పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మూడు సవంత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మంగళవారంరోజు పాల్వంచలో గల అయ్యప్పస్వామి దేవాలయం ఆవరణంలో ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయులు బాలుతో సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా హరినాథ్ తో కలిసి రుద్రాక్ష మొక్కలు నాటారు.

అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన రేవెల్లి మధుసూదన్ తండ్రి వెంకటేశ్వర్లు 29 సంవత్సరాలు వృత్తిరీత్యా పూజారిగా వ్యవహరిస్తాడు. అతడు ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా సతమతమవుతూ మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, మృతుని తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు.