ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ ను అభినందించిన ట్రాఫిక్ పోలీస్ ధారవత్ చందా నాయక్
భావితరాలకు స్వచ్ఛమైన నీరు,గాలి,ఆహారం లభించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయులు బాలు నాయక్ అన్నారు.స్వచ్ఛ మైన,ఆహ్లాదరకమైన వాతావరణం కోసం,ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు,వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని ట్రాఫిక్ కానిస్టేబుల్ చందా నాయక్ పేర్కొన్నారు.విరివిగా మొక్కలు నాటుతూ మరియు పలువురికి మొక్కలు పంపిణీ చేస్తున్నా బాలు నాయక్ ను ఆయన అభినందించారు.
తీజ్ పండుగ” సందర్భంగా మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు వర ప్రసాద్
“తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకృతి హరిత దీక్షుడు భూక్య వరప్రసాద్ తన మిత్రుడు భూక్య గణేష్ తో కలిసి ముత్యాలంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక మునగ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుతూ…మన్ కీ బాత్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చే ప్రశంసించబడిన సింగరేణియన్,భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్,ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ ఈ సందర్భంగా […]