ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బారాస మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ కూడలిలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు

ధర్మారం జులై 24 (తెలంగాణ వాణి విలేఖరి) మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో నవయుగ చక్రవర్తి ప్రసిద్ధ కవి వర్ధంతి వేడుకలను దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయన తన సామాజిక స్పృహతో కూడిన రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో గొప్ప స్థానం పొందాడని అన్నారు. ముఖ్యంగా కుల వ్యవస్థపై తన కవితల ద్వారా తిరుగుబాటు చేశాడని సమాజంలో అసమానతలను ఎత్తి చూపాడన్నారు.ఆయన […]