పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నాడు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100% ఫలితాలతో విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థులు కష్టపడి చదివిన ఫలితం దక్కిందని 100% రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు నాయక్ ఉపాధ్యాయులకు చరవాణి ద్వారా అభినందనలు తెలిపారు.
పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రామవరం ప్రాంతానికి చెందిన పెంకె గీతిక 10వ తరగతి ఫలితాలలో 560 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేసింది.గీతిక తల్లి ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్,తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నారు.ఇదే స్ఫూర్తి తో పై చదువులు చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని స్థానిక ప్రజలు పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.
పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు.
పదవ తరగతి ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిరుత్సహా పడకుండా వారిలో మానసిక ధైర్యాన్ని కల్పించాలని TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు ఆంగోతు రాంబాబు అన్నారు .ప్రతిభకు మార్కులకు సంబంధం లేదన్నారు. విద్యార్థులు ఫలితాలు ఎలా ఉన్నా ఆందోళన చెందకూడదానీ, ఇది జీవితంలో తొలి అడుగు మాత్రమేనని చెప్పారు.