పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణా వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను: కె ఎన్ రాజశేఖర్
కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణానికి చింతిస్తూ గుర్తుగా శనివారం నాడు మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రకృతి హరిత దీక్ష & గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్, ప్రకృతి హరిత దీక్షా వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని కుటుంబ సభ్యులు తెలిపారు.భూతల్లికి తీరని లోటని ఆయన అన్నారు.పచ్చదనానికి పర్యావరణ పరిరక్షణలో భావితరాలకు ఆస్తులుగా ఇచ్చిన […]
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత

పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో రామయ్య తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. కానీ భారీగా మొక్కలను పెంచుతు తన ఇంటిపేరునే వనజీవి గా మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈయన చేసిన కృషికి గుర్తింపుగా సామజిక సేవా విభాగంలో 2017 పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కోటికిపైగా మొక్కలు నాటిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.