UPDATES  

విచారణకు పిలిచి రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులు

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్‌.. మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చారు. దీనికి ముందు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది. ఇది మహిళా కమిషన్‌ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ […]

ఒకేసారి టీ.పీసీసీ అధ్యక్షుడు, కొత్త మంత్రుల పేర్ల ప్రకటన

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం ఒకేసారి కొత్త అధ్యక్షుడి పేరుతో పాటు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పేర్లను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్‌గా బీసీ నేతనే నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు లీకులు వెలువడ్డాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా […]

నాగార్జున “ఎన్” కన్వెన్షన్ కూల్చివేత…

హైడ్రా దృష్టిలో సినీ, రాజకీయ, బడబాబులు ఎవరైనా ఒక్కటే అంటున్న రంగనాధ్ హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతను నిర్వహిస్తున్నారు. […]