గిరిజన పాఠశాలకు రూ.3.5 లక్షల అభివృద్ధి వసతులు
బూర్గంపహాడ్ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ ఆర్థిక సహకారంతో అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. సమరిటన్స్ ఫర్ ద నేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సుమారు రూ.3.5 లక్షల వ్యయంతో అదనపు తరగతి గది, వాష్‌రూమ్ నిర్మించి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం సమాజ బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం మోహన్ లాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 9