UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 ముంబై దెబ్బకు బీజింగ్ బేజారు.. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు

భారత ఆర్థిక రాజధాని ముంబై వరల్డ్ లెవల్‌లో సత్తా చాటింది. పొరుగు దేశం చైనా క్యాపిటల్ బీజింగ్‌ను వెనక్కు నెట్టింది. ఆర్థికంగా తనకు ఎవరూ సాటి రాలేరని మరోసారి చాటి చెప్పింది.

దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఇండియాను ఆకాశానికెత్తేస్తున్నారు.

బీజింగ్‌ను వెనక్కునెట్టి ఆసియా బిలియనీర్ క్యాపిటల్ టైటిల్‌ను ముంబై కైవసం చేసుకుంది. ఈ మేరకు తాజాగా విడుదలైన ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024’ దీన్ని ధ్రువీకరిస్తోంది. 92 మంది బిలియనీర్లతో ముంబై చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజింగ్‌ను అధిగమించింది. సంపదతో పాటు శ్రేయస్సు విషయంలోనూ అభివృద్ధి కేంద్రంగా తన హోదాను పటిష్టం చేసుకుంది.

 

ఈసారి కొత్తగా నగరం 27 మంది కొత్త బిలియనీర్‌లను జోడించుకుంది. కాగా ఈ సంఖ్య బీజింగ్‌లో కేవలం 6 మాత్రమే కావడం విశేషం. బిలియనీర్ల సంఖ్య పెరుగుదల ప్రపంచ వేదికపై భారతదేశానికి పెరుగుతున్న ఆర్థిక ప్రాముఖ్యతను బలపరుస్తుంది. రెండవ అత్యధిక బిలియనీర్ చేరికలను నమోదు చేసి రికార్డు సృష్టించింది.

2024 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో టాప్ 10లో ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చోటు దక్కించుకున్నారు. గ్లోబల్ ఎలైట్ ల్యాండ్‌స్కేప్‌లో భారత్ కీలక ప్లేయర్‌గా ఆవిర్భవించడంలో ప్రపంచ ప్రముఖుల మధ్య అంబానీ పాత్రను ఈ జాబితా నొక్కిచెప్పింది. చైనాలో 573 మంది బిలియనీర్ల సంపద క్షీణించగా.. భారత్‌లో మాత్రం కేవలం 24 మందే తిరోగమనాన్ని చవిచూశారు. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ధిక్కరిస్తూ భారతదేశ సంపద గత ఏడాదితో పోలిస్తే 51 శాతం పెరిగింది.

గతేడాది కంటే ముంబై సంపదలో 47 శాతం పెరుగుదల నమోదైంది. ఇదే సమయంలో బీజింగ్ యొక్క 28 శాతం క్షీణతను అధిగమించింది. చైనా బిలియనీర్ల సగటు సంపద 3.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారత్ 3.8 బిలియన్ డాలర్లతో ముందంజలో ఉంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది అనేందుకు ఈ గణాంకాలే ఉదాహణ అని హురున్ ఇండియా వ్యవస్థాపకులు అనాస్ రెహమాన్ జునైద్ పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest