
సైదాపూర్ : జనవరి:9 ( తెలంగాణ వాణి విలేకరి )
సైదాపూర్: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య పర్యవేక్షకుడు ఎస్ రమేష్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్పతి ప్రమేల ఆదేశాల మేరకు మండలంలోని బొమ్మకల్ గ్రామంలోని జిల్లా పరిషత్తు, పాఠశాలలో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందు గోళీలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికుల బరువు, బిపి, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించారు. అసాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ద్వారా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు గ్రామాల్లో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియంత్రణకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా వంట కార్మికులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మారుతి , ఉపాధ్యాయులు రామకృష్ణ, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి వాణి, ఏఎన్ఎం సులోచన, ఆశ వర్కర్లు సుజాత, భారత తదితరులు పాల్గొన్నారు.
