స్థానిక చంద్రుగొండ మండల పరిధిలోని మూడు కాంప్లెక్స్‌ల పరిధిలో చంద్రుగొండ రేపల్లెవాడ, పోకులగూడెం కేంద్రాల్లో బాల మేళా 2.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి సురయ్య, చంద్రుగొండ కాంప్లెక్స్ హెచ్ఎం ఉప్పల్ రెడ్డి,రేపల్లెవాడ కాంప్లెక్స్ హెచ్ఎం రామచందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.లైబ్రరీ, స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో ప్రతి తరగతి నుంచి ఒక్కో విద్యార్థిని ఎంపిక చేసి మండల స్థాయికి పంపించారు. మూడు సబ్జెక్టుల్లో నిర్వహించిన పరీక్షల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను రామచందర్ చేతుల మీదుగా అందజేశారు.చంద్రుగొండ కాంప్లెక్స్ హెచ్ఎం ఉప్పల్ రెడ్డి, రేపల్లెవాడ కాంప్లెక్స్ హెచ్ఎం సూరయ్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సెక్రటరీస్ తేజావత్ శ్రీరాములు, వాంకుడోత్ రామకృష్ణ, ఆర్పిలు బానోత్ వీరన్న, భూక్య చందులాల్, నునావత్ భూక్య రవి కిరణ్ కుమార్ సెక్రటరీతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.