లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అజ్మీర లైలా గ్రామంలోని వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు.తాగునీరు, డ్రైనేజీ,విద్యుత్, రహదారుల వంటి సమస్యలపై స్థానికులతో మాట్లాడి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని చరవాణి ద్వారా సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో నేరుగా మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలక వర్గం సభ్యులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 8