UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 ఢిల్లీలో దొంగలు ఎంతకు తెగించారు.. ఏకంగా జేపీ నడ్డా సతీమణి కారు గాయబ్

ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు. సెక్యూరిటీ దాదాపు క్యాబినెట్ మినిస్టర్ కు ఉన్నంత రేంజ్ లో ఉంటుంది. పైగా ఆయన చుట్టూ ఎప్పటికీ పోలీసులు ఉంటారు.

చివరికి ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ కూడా ఇలాంటి భద్రతే ఉంటుంది. కానీ అంతటి భద్రతను దాటుకొని దొంగలు వచ్చారు. పోలీసులు పహారా కాస్తున్న వారి కళ్ళు కప్పారు. ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారునే చోరీ చేశారు. దీంతో ఢిల్లీలో కలకలం నెలకొంది.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సతీమణికి HP 03 D 0021 అనే నెంబర్ ఉన్న తెలుపు రంగు టాప్ ఎండ్ ఫార్చునర్ కారు ఉంది. ఈ కారును ఇటీవల సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని గోవిందు పూరి ప్రాంతంలో ఓ సర్వీస్ సెంటర్ లో సర్వీస్ కు ఇచ్చారు. ఈ కారుకు ఢిల్లీలోని గోవిందు పోరి ప్రాంతంలో నివసించే జోగిందర్ సింగ్ డ్రైవర్ గా ఉన్నాడు. సర్వీస్ లో భాగంగా కారును సర్వీస్ సెంటర్లో డ్రైవర్ పార్క్ చేశాడు. మధ్యాహ్నం భోజనం కోసం గోవింద్ పురి ప్రాంతంలో తన ఇంటికి వెళ్ళాడు. భోజనం చేసి తిరిగి వచ్చేసరికి సర్వీస్ సెంటర్లో కారు కనిపించలేదు. సర్వీస్ సెంటర్ నిర్వాహకులను అడిగితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అసలే బిజెపి జాతీయ అధ్యక్షుడు భార్య కారు కావడంతో పోలీసులు ఆగమేఘాల మీద సర్వీస్ సెంటర్ వద్దకు వచ్చారు. సిసి కెమెరాలు పరిశీలించారు. సర్వీస్ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడారు. వారు మాత్రమే కాకుండా మరో ఆరు బృందాలు ఆ కారు గాలింపు కోసం రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు గుర్గావ్ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటికే ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నారు. ఏకంగా జేపీ నడ్డా భార్య కారు చోరీకి గురి కావడం పట్ల నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.” నడ్డా భార్య కారు చోరీకి గురి అయింది కాబట్టి ఏడు బృందాల పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అదే సామాన్యుల వాహనాలు పోతే ఇలా రంగంలోకి దిగుతాయా.. పోలీసులు కనీసం పట్టించుకుంటారా” అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest