UPDATES  

NEWS

ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ

 ఇద్దరిని చంపేసిన ఎలుగుబంటి.. ఆ ఊరిలో భయం భయం..!

శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోయారు. అనకాపల్లి గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది.

ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి..పరిశీలించారు.

ఎలుగుబంటి దాడి గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దానిని బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామం విడిచి బయటకు వచ్చేందుకు గ్రామస్తులు భయపడిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళ ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లకూడదు.. గుంపు గుంపుగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. త్వరలోనే ఎలుగుబంటిని పట్టుకుంటామని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest