UPDATES  

NEWS

ప్రభుదయాల్‌ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్

 అల్పోర్స్ జూనియర్ కళాశాల లో వందేమాతరం వేడుకలు

తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో, (నవంబర్ 08 ) : “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు పూర్తైన ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని, అల్ఫోర్స్ జూనియర్ కాలేజ్, భీమారం, హనుమకొండ క్యాంపస్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్  నరేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఉత్సాహంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో విద్యార్థులు వందేమాతరం గీతాన్ని ఆరాధనీయంగా ఆలపించి, భారత మాత పట్ల తమ అపారమైన ప్రేమ, గౌరవం మరియు కృతజ్ఞతను వ్యక్తపరిచారు.క్యాంపస్ అంతటా దేశభక్తి గానాలతో మార్మోగి పోగా, విద్యార్థుల స్వరాలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరింపజేశాయి.ఈ  సందర్భంలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు మాట్లాడుతూ, వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన తీరు గురించి వివరించారు.ఈ గీతం మనకు అందించే ఏకతా, ధైర్యం, దేశభక్తి, త్యాగం వంటి విలువలను విద్యార్థులు తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు.విద్యార్థులు తమ దేశం పట్ల ప్రేమ, నిజాయితీ, సేవాభావం కలిగి ఉండి — “వందేమాతరం” యొక్క ఆత్మను నిలబెట్టాలని ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమం చివరలో అందరూ ఏకస్వరంతో “వందేమాతరం” నినదిస్తూ,క్యాం పస్ అంతా దేశభక్తి జ్వాలతో నిండిపోయింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest