UPDATES  

NEWS

బెస్ట్ సిటిజన్ పోలీస్ అవార్డు అందుకున్న ధర్మారం ఎస్సై తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలి రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించిన కొత్తగూడెం క్రీడాకారులు టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి లను అరెస్టు చేయాలి : గాయత్రి బెహరా యూట్యూబ్ వీడియోస్ పేరిట ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన మరో సంస్థ ఢిల్లీకి గులాంగిరి చేయడం కోసమే రాజీవ్ విగ్రహ ఏర్పాటు : కొట్టి వెంకటేశ్వరరావు ఢిల్లీ సీఎంగా అతిషి మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది “ఎర్రజెండా” నే కొత్త ఒరవడికి సీఎం నాంది ! నిమజ్జన వేడుకల్లో రేవంత్ జాతీయ జెండాకు అవమానం

 సర్కార్ సంచలన నిర్ణయం.. 70 వేల ప్రభుత్వ ఉద్యోగులపై వేటు..

ఇప్పటికే ఆర్థిక మాంద్యం తీవ్రస్థాయిలో పెరిగింది. కొనుగోళ్ళు నిలిచిపోవడంతో చాలావరకు సంస్థలు వ్యయ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నాయి.

ఐటీ సంస్థలైతే అడ్డగోలుగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కోవిడ్ సమయంలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకున్న ఆ సంస్థలు.. ఇప్పుడు మెడపట్టి బయటికి గెంటేస్తున్నాయి.. గతంలో పింక్ స్లిప్ లు ఇచ్చి బయటికి పంపించేవి. కానీ ఇప్పుడు ఒక్క వీడియో కాల్ ద్వారానే “గెట్ లాస్ట్ ఫ్రం హియర్” అంటున్నాయి.. ఇప్పటికే లక్షల్లో ఉద్యోగులు ఐటి కొలువులు కోల్పోయారు. వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే భయం భయంగానే ఐటీ ఉద్యోగులు కొలువులు చేస్తున్నారు.

ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపి కర్రది మరొకదారని… ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే.. అర్జెంటీనా దేశంలో ఏకంగా అక్కడి ప్రభుత్వం 70 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా ఆ దేశంలో సంచలనం నమోదయింది. ఇప్పటివరకు లే ఆఫ్ పేరుతో ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ చరిత్రలో తొలిసారిగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధపడిన దేశంగా అర్జెంటీనా నిలవనుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ వచ్చే ఐదు నెలల్లో 70 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుందామని ఆయన ప్రకటించారు. అయితే ఈ తొలగింపులు అర్జెంటీనా దేశంలో ఉన్న 35 లక్షల ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే తక్కువే అని జేవియర్ మిలీ సమర్ధించుకుంటున్నారు.”ఆర్థిక భారం పెరుగుతోంది. వ్యయ నియంత్రణ చర్యలో భాగంగా మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.. కార్మిక సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే సవాల్ లేదని” ఆయన ప్రకటించారు.

అర్జెంటీనా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వేలాదిమంది ఉద్యోగులు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం వారితో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి 31న ఆ ఒప్పందం ముగుస్తుంది. వాస్తవానికి గత ఏడాది కాంట్రాక్టు ముగిసినప్పటికీ ప్రభుత్వం మూడు నెలలు ఆ గడువు పెంచింది. గడువు పెంచే సమయంలో అర్ధాంతరంగా తొలగిస్తామని అప్పట్లో ప్రభుత్వం చెప్పలేదు. దీంతో ఎలాగైనా తమను రెగ్యులర్ చేస్తారని ఆ ఉద్యోగులు భావించారు. కానీ ప్రభుత్వం వ్యయ నియంత్రణ పేరుతో వారిని తొలగించడానికి నిర్ణయించడం సంచలనం కలిగిస్తోంది. అయితే ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే రోజుల్లో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేసే ఉద్యమానికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించాయి. ఇప్పటివరకు ప్రైవేట్ కంపెనీలే ఉద్యోగులను తొలగించాయి. కానీ చరిత్రలో తొలిసారిగా 70 వేల మంది ఉద్యోగులపై వేటు వేస్తూ అర్జెంటీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest