UPDATES  

NEWS

 మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

టేకులపల్లి, ఆగస్టు 25 (తెలంగాణ వాణి):

మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐ తిరుపతి సూచించారు. పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మంగళవారం టేకులపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్‌ఐ మాట్లాడుతూ పండుగ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మతపరమైన కార్యక్రమాల్లో పరస్పర గౌరవం, సామరస్యాన్ని పాటిస్తూ పండుగను విజయవంతంగా నిర్వహించాలని మత పెద్దలకు సూచించారు. సమావేశంలో పోలీస్‌ సిబ్బంది, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 26 August 2026, 8:35 am Posted by : TELANGANA VANI

మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

టేకులపల్లి, ఆగస్టు 25 (తెలంగాణ వాణి):

మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐ తిరుపతి సూచించారు. పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మంగళవారం టేకులపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్‌ఐ మాట్లాడుతూ పండుగ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మతపరమైన కార్యక్రమాల్లో పరస్పర గౌరవం, సామరస్యాన్ని పాటిస్తూ పండుగను విజయవంతంగా నిర్వహించాలని మత పెద్దలకు సూచించారు. సమావేశంలో పోలీస్‌ సిబ్బంది, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest