UPDATES  

NEWS

 టేకులపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా వన మహోత్సవం

టేకులపల్లి, ఆగస్టు 25 (తెలంగాణవాణి) టేకులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో “వన మహోత్సవం” కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్ ,పంచాయతీ కార్యదర్శి శోభన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకయ్య మరియు ఉప సర్పంచ్ పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోడా బాలు నాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని,నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు.వెంకయ్య పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను వివరించగా,పంచాయతీ కార్యదర్శి శోభన్ గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది,ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 26 August 2026, 8:32 am Posted by : TELANGANA VANI

టేకులపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా వన మహోత్సవం

టేకులపల్లి, ఆగస్టు 25 (తెలంగాణవాణి) టేకులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో "వన మహోత్సవం" కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్ ,పంచాయతీ కార్యదర్శి శోభన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకయ్య మరియు ఉప సర్పంచ్ పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోడా బాలు నాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని,నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు.వెంకయ్య పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను వివరించగా,పంచాయతీ కార్యదర్శి శోభన్ గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది,ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest