భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుడిపాడు రామచంద్రాపురం గ్రామంలోని కాకతీయ కాలంనాటి శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది.శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఎన్. సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జీఎల్ఎస్–జేఏసీ భద్రాద్రి జిల్లా కమిటీ హాజరై స్వామిని దర్శించుకుంది.ముఖ్య అతిథులుగా శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి తురాజ్ రాజాజీ, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, జీఎల్ఎస్–జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, వైస్ చైర్మన్ ప్రసాద్ నాయక్, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హతిరామ్ పవార్, వెంకట్ నాయక్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Post Views: 8