ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న, చదువు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులకు ఉపాధి కల్పన లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ . కే. దేవసేన తెలిపారు. ఇటీవల కాలంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు.ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుందన్నారు 18 నుండి 25 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులు శిక్షణకు అర్హులు అన్నారు. జూన్ మాసం లో రాష్ట్ర వ్యాప్తంగా 239 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులతో పాటు చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సైతం నియమ నిబంధనల ప్రకారం శిక్షణకు అర్హులన్నారు శిక్షణ అనంతరం ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొన్నారు . పదవ తరగతి , ఇంటర్మీడియట్ , ఐటీఐ, పాలిటెక్నిక్ , డిగ్రీ పూర్తి చేసిన , డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు , చదువు మధ్యలో మానేసి 18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులు మల్లాపూర్ గురుకుల పాఠశాల కాలేజీలో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు వివరాలకు పాఠశాల కార్యాలయంలో సంప్రదించా లని ప్రిన్సిపల్ దేవసేన ఒక ప్రకటనలు తెలిపారు.