హైదరాబాద్ (తెలంగాణ వాణి)
కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కానీ ఆ స్కూల్ కూల్చకండంటూ అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్లు నిర్మించామని వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని గతంలో కూడా తనపై కాల్పులు జరిగాయని కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కత్తులతో దాడి చేయండి. కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.
Post Views: 439