తల్లకిందులుగా ఆవిష్కరించిన ఉపాధ్యాయులు
జూలూరుపాడు (తెలంగాణ వాణి)
జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం ఎంపిపిఎస్ పాఠశాలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను తల్లకిందులుగా ఆవిష్కరించారు. ఈ విషయాన్నీ ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ జెండాను సరిచేసే ప్రయత్నం చేయకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వారే జాతీయ జెండాకు అవమానం కల్గిస్తే సామాన్యులు పరిస్థితేమిటని వెంటనే జాతీయజెండా తల్లకిందులుగా ఆవిష్కరించిన ఉపాధ్యాయుల పై పలువురు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారత దేశానికి ఎందరో మహాత్ముల ప్రాణ త్యాగాలతో సంపాదించుకున్న స్వాతంత్ర చిహ్నాన్ని విద్యా వంతులైన ఉండి తల కిందులుగా ఆవిష్కరించడం విమర్శకు కారణమైంది. బాధ్యత గల విద్యావంతులు జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యం వహించడం భారత దేశానికే అవమానమని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.