మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి

వీణవంక (తెలంగాణ వాణి) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శనిగరపు మల్లయ్య (70) హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, ఆదివారం మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుడి కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంధి సమ్మిరెడీ, కర్ణకంటి శంకర్ రెడ్డి, మేకల వేణు తదితరులు పాల్గొన్నారు.
ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో

చాతకొండ సర్పంచ్ అభ్యర్థిగా వజ్జా ఈశ్వరి లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మిదేవిపల్లి మండలం, చాతకొండ గ్రామానికి చెందిన వజ్జా ఈశ్వరి ఆశ కార్యకర్త ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచింది. ఉమ్మడి చాతకొండ పంచాయతీ మొట్టమొదటి సర్పంచ్ గా పనిచేసిన స్వర్గీయ మాజీ సర్పంచ్ వజ్జా సీతారాములు భార్య గా అందరికి సుపరిచితురాలైన వజ్జా ఈశ్వరి భర్త బాటలో ప్రజా సేవ చేసేందుకు పంచాయతీ బరిలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఆశా […]
ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో భారత రాజ్యాంగ పితామహుడు సామాజిక సంఘసంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ పరి నిర్వాణ దివాస్ ను దళిత బహుజన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ..దేశానికి ఆదర్శ ప్రాయుడు భీమ్రావు అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు. యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే […]
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్
ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా యంగ్ ఇండియన్ జాతీయ సేవ జాతీయ అవార్డు అందుకున్న ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలునాయక్ శుక్రవారం నాడు స్థానిక లక్ష్మీదేవిపల్లి సెంటర్ నందు చెందిన చుంచుపల్లి ఎంపీడీవో ఆఫీస్ క్లర్క్ టి. సతీష్ మరియు రాజ్ కోటి లకు పచ్చని మొక్కలను వితరణ చేశారు.ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. సతీష్ రాజ్ కోటి (కోటేశ్వర్ రావు)మొక్కలను అందుకొని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు
నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట
చుంచుపల్లి మండలం నంద తండా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున జయరాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఆదేశాలు,గ్రామస్తుల అండతో నామినేషన్ తర్వాత ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ప్రారంభించారు.జయరాం నాయక్ మాట్లాడుతూ.. నంద తండా ప్రజలకు నేను సుపరిచితుడిని,ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవలు చేస్తూ సామాన్యులకు సహాయం అందిస్తున్నాను.పార్టీ విధేయతతోనే పోటీ చేస్తున్నాను.గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే నంద తండాను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.గ్రామ అభివృద్ధిపట్ల తన కుటుంబం పదేళ్లుగా చూపుతున్న సేవా […]
గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న
స్థానిక గార్ల పట్టణ కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం శ్రేణులు కూడా పాల్గొని మహానుభావుడి స్ఫూర్తిని స్మరించారు. ఈ కార్యక్రమంలో లైవ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ రాజకుమార్ జాదవ్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్.
గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్.ఈ సందర్భంగా ఒక మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఆయన మాట్లాడుతూ… ఐటిడిఎ భద్రాచలం పీవో రాహుల్ సూచనలతో అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా ఇంజనీరింగ్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారన్నారు.అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖ ఎదుర్కొంటున్నారని పలు అంశాలపై ఏడీ సర్వేశ్వర రెడ్డికి విన్నవించారు.ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకు సేవలు అందించే ఐటిడిఎ ఇంజనీరింగ్ […]
జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల మహాత్మా గాంధీ విగ్రహం ప్రక్కన గత కొంతకాలంగా వైన్ షాప్ నిర్వహించడం వలన ఆ చుట్టుపక్కల ఇండ్ల లో నివాసం ఉంటున్న కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఇక్కడి వైన్ షాప్ ను జనవాసులకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని అక్కడి ఇండ్ల యజమానులు మిట్టపల్లి చంద్రకాంత్ రెడ్డి, దూడ లచ్చయ్య, రాజ మల్లయ్య, తో పాటు మరికొందరు గురువారం ధర్మారం […]
మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

కోరుట్ల (ఆర్సి తెలంగాణ వాణి) కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారులు పలు విభాగాల రికార్డులు పరిశీలించడం జరుగుతున్నది.ఈ అధికారుల తనిఖీలు మామూలేనా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో అని తెలియాల్సి ఉంది.
మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో కరెన్సీపై అంబేడ్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావుపూలే 135వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహుజనులకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన 1827 ఏప్రిల్ […]