చిరంజీవిని నా తమ్ముడిగా అసలు ఊహించుకోలేను.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్‌లో ఎంతమంది నటినటుల ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎవరికివారు తమదైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు వచ్చిన సీనియర్ హీరోయిన్లలో సౌందర్య, విజయశాంతి, రమ్యకృష్ణ, అమలా ఇలా అందరు ఒకే తరం హీరోయిన్స్ అయినా.. వారందరిది డిఫరెంట్ స్టైల్. ముగ్గురు వైవిధ్యమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. గ్లామర్ పరంగా కొందరు దూసుకుపోతుంటే.. హోమ్లీ రోల్స్ లో మరికొందరు ఆకట్టుకుంటారు. అలా 90వ దశంలో హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఆమని […]
గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మాడ్ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించగా అనంతిక, గౌరీ ప్రియా రెడ్డి, గోపిక విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాక కామెడీ సినిమాలకు తెలుగులో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సీక్వెల్ గురించి క్లారిటీ వచ్చేసింది. […]
ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు! ఏంటి వీటి ప్రత్యేకత? రూట్స్ వివరాలివే!
సాధారణంగా బస్సులో టూర్స్ వెళ్లాలంటే ఒకచోట నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు కొన్నిసార్లు బస్సు మారాల్సి వస్తుంది. అలాకాకుండా ఒకటే బస్సు టూర్ మొత్తాన్ని కవర్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఇలాంటి ఐడియాతోనే సర్క్యూట్ టూర్ బస్సులు రెడీ అయ్యాయి. అంటే ఇవి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్స్ వెళ్లేవాళ్లకు అనుకూలంగా ఉంటాయి. ఎపీలోని ముఖ్యమైన, చరిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను రెడీ చేసింది ఆర్‌టీసీ. ఇందులో […]
ఏపీలో వాలంటీర్లకు ఈసీ షాక్.. 30 మంది విధుల నుంచి ఔట్..!
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు కోడ్‌ను కఠినంగ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి పట్ల ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా, కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో 11 మంది వాలంటీర్లపై వేటు పడింది. మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. ఈ నెల 17న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నట్టు గుర్తించారు. ఆ విషయం […]
మహిళలకు మెరుగైన ఆదాయం అందిస్తోన్న రొయ్యలు,సీ ఫుడ్ ప్రాసెసింగ్
ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న రొయ్యల పెంపకం,సీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలతో (Shrimp and seafood processing)మహిళలకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఏపీలో రొయ్యల ప్రాసెసింగ్.. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం అందించడం ద్వారా వారి సాధికారతకు ఉత్ప్రేరకంగా పనిచేసింది. గడిచిన 10 సంవత్సరాలలో..ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేదా ఫ్యాక్టరీలు 20 నుండి 90కి పైగా పెరిగాయి. ప్రతి ప్రాసెసింగ్ ఫెసిలిటీలో పెట్టుబడి సగటున 5 మిలియన్ డాలర్ల గా ఉండగా.. ప్రాసెసింగ్ రంగంలో మొత్తం పెట్టుబడి […]
ఇద్దరిని చంపేసిన ఎలుగుబంటి.. ఆ ఊరిలో భయం భయం..!
శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోయారు. అనకాపల్లి గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి..పరిశీలించారు. ఎలుగుబంటి దాడి గురించి సమాచారం అందుకున్న […]
AP Govt: హైదరాబాద్‌లో ఆఫీసులకు ఏపీ సర్కార్ అద్దె చెల్లించాలా?
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. మే 13న అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నెల జూన్ 4వ తేదీన అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారం చేపడుతుంది? మరోసారి జగన్ వస్తారా? లేదంటే ఈ సారి చంద్రబాబుకు జనం అవకాశం ఇస్తారా? ఇలా ఏపీలో ఏం జరుగబోతుందో అనే అంశం ఆసక్తిగా మారింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత… తెలంగాణలో ఉన్న […]
బాలకృష్ణకు ఆ స్వామిజీ ఎఫెక్ట్.. హిందూపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలు రోజు రోజుకు హాట్ హాట్‌గా మారిపోతున్నాయి. టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన (Janasena)మూడు ఒకవైపు.. అధికార వైసీపీ(YCP) ఒక్కటే ఒకవైపు పోటీ చేస్తూ ఈసారి ఎన్నికల్లో తమ బలాబలాలు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి అన్నీ పార్టీలు. అయితే కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు మూడు పార్టీల నేతలకు తల నొప్పిగా మారింది. చివరకు టీడీపీ కీలక నేత, సినీ నటుడు హిందూపురం సిట్టింగ్ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. సీట్ల కేటాయింపులో భాగంగా […]
అత్యంత ఖరీదైన ఆవు ఇదే..!ఈ నెల్లూరు జాతి ఆవు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఆవులు, గుర్రాలు తదితర జంతువులకు సంబంధించి తరచుగా వేలం పాటలు జరుగుతుంటాయి. వీటిలో కొన్ని జంతువులు కోట్ల రూపాయలకు అమ్ముడు అవుతూ రికార్డు సృష్టిస్తుంటాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జాతికి చెందిన ఒక ఆవు కనీవినీ ఎరుగని రీతిలో కళ్లు చెదిరే ధర పలికింది. బ్రెజిల్ (Brazil)లో జరిగిన ఒక వేలంలో ఏకంగా 40 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఈ ఆవు పేరు వయాటినా-19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవీస్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా […]
టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ – కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్
టాలీవుడ్ ప్రముఖ నటుడు నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddarth) శుక్రవారం టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, టీడీపీ చీరాల అభ్యర్థి కొండయ్య యాదవ్ అల్లుడు నిఖిల్. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున నిఖిల్ ప్రచారం నిర్వహించనున్నారు. కాగా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరో నిఖిల్.. తరచూ సామాజిక బాధ్యతతో కొన్ని పోస్టులు పెడుతుంటారు. ఆయన […]