UPDATES  

NEWS

 పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుగర్భశోక, పరీక్ష చికిత్స శిబిరం

రాజపేట: జనవరి 09(తెలంగాణ వాణి విలేకరి)

 మండలం లోని నేమిల గ్రామంలో పశుగణాభివృద్ధి,నల్గొండ మరియు పశుసంవర్ధక శాఖ రాజపేట ఆధ్వర్యంలో పశు గర్భకోశ పరీక్ష మరియు చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్నిగ్రామ సర్పంచ్ పులి రాజు ఉప సర్పంచ్ శివకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ ఎం చంద్రారెడ్డి మాట్లాడుతూ రైతు సోదరులందరూ పాడి పశువులకు ఈనిన తర్వాత తప్పకుండా మూడు నెలలకు కట్టించాలని మాట్లాడారు.అదేవిధంగా పోషణలో పిండి పదార్థాలు, మాంసకృతులు విటమిన్లు స్థూల సూక్ష్మ పోషకాలు మినరల్స్ సమతుల్యంగా ఇస్తే పాడిపశువులు సరైన సమయంలో ఏదోకొచ్చి మూడు నెలలు లోపు కట్టే అవకాశం ఉంటుందని చెబుతూ, అదేవిధంగా రైతు సోదరులందరూ వందరోజుల ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆవుల,గేదెల పాకలు1 లక్ష రూపాయలు గొర్రెల మరియు మేకల పాకలు 92 వేలు మరియు కోళ్లపాకలు 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకోవాలని, రైతు సోదరులకు సూచించారు . చికిత్స శిబిరంలో రఘునాపూర్ పశువైద్యాధికారి డాక్టర్ కె భాస్కర్, గోపాలమిత్ర సూపర్ వైజర్ గోపగాని భానుప్రసాద్ గోపాలమిత్రులు మహేష్, సట్టు బాల కిషన్,రామ్ చందర్, శ్రీశైలం పశు వైద్య సిబ్బంది శ్రీకాంత్ అజయ్ పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest