
ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్ధినులకు సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారని వారి తల్లిదండ్రులు మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ కి ఫోన్ చేసి సమస్యలను వివరించగా వెంటనే అక్కడికి చేరుకున్నారు. విద్యాలయంలోని వంట గది మరియు విద్యార్థులు త్రాగే నీరు, తినే ఆహారాన్ని పరిశీలించారు. విద్యాలయంలో ప్రస్తుత దుర్బర పరిస్థితిని మరియు విద్యార్థినిలు తినే ఆహారం వారు వారి అవసరాలకు నిమిత్తం వాడే కలుషితరమైన నీటిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యమంత్రి & విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడని అన్నారు. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచాక అమెరికాలో తప్ప ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని సోషల్ మీడియాలో ఫోజులకు తప్ప నియోజకవర్గంలోని విద్యాసంస్థలపై అవగాహన లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి నియోజకవర్గం లోని అన్ని గురుకుల పాఠశాలలో పర్యటించి వారి సమస్యలను తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. లేని పక్షాన కలెక్టరేట్ ముట్టడి చేస్తామని అన్నారు.
