UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 స్థానికంలో విజయ డంకా మోగించాలి : బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి విజయ డంకా ముగిస్తుందని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ధర్మారం మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు తలుపులు బద్దలు కొడతామని ఎంపీపీ జడ్పిటిసి లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు దేశవ్యాప్తంగా హర్షిస్తున్నారని తెలిపారు. జెడ్పిటిసి,ఎంపీపీ తో పాటు సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలను అధిక సంఖ్యలో కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి అధ్యక్షత వహించగా భాజపా సీనియర్ నాయకులు మేడ వేణి శ్రీనివాస్, సంధినేని లక్ష్మణ్, గోనె సాయి, వేల్పుల తిరుపతి, దేవి కొమురేష్, కొలిపాక మణికంఠ, మామిడి చెందు, కర్రె లక్ష్మణ్, జంగిలి రాజయ్య, రేండ్ల శ్రీనివాస్, పల్లె లక్ష్మణ్, దేవి రజనీకాంత్, గుమ్ముల తిరుపతి, బత్తుల కుమార్, కాల్వ కుమార్ రాజు, దంత రాజన్న అత్తిరి పత్తిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest