ఆస్ట్రేలియాలో క్రిటికల్ మినరల్స్ రంగంలోకి సింగరేణికి ఆహ్వానం

సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతితో మోనాష్ యూనివర్సిటీ బృందం భేటీ కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 31 (తెలంగాణ వాణి) కీలక ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆస్ట్రేలియా దేశంలో కలిసి పనిచేయడానికి ముందుకురావాలని ఆ దేశ ప్రముఖ పరిశోధన సంస్థ మోనాష్ యూనివర్సిటీ సింగరేణికి ఆహ్వానం పలికింది. మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం సోమవారం సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ద ప్రకాశ్ జ్యోతి తో సమావేశమై ఆస్ట్రేలియా దేశంలో క్రిటికల్ మినరల్స్ రంగంలో గల అవకాశాలను వివరించింది. […]