UPDATES  

NEWS

పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం పాఠశాలల సమీపంలోని చిరుతిండి దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్ కాలువల శుభ్రతతో ప్రజారోగ్యం – సర్పంచ్ జర్పుల దేవి

పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు

పాల్వంచ పట్టణ పరిధిలోని జగ్గుతండా నవభారత్ ఏరియాలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు బంజారా సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ బానోత్ వీరు నాయక్, గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ రాథోడ్ హాజరయ్యారు.టోర్నమెంట్ నిర్వాహకులు లావుడియా గణేష్, బానోత్ ప్రతాప్, గుగులోత్ సేవ్య, యన్ పర్షి, గుగులోత్ బాలు, భూక్యా రమేష్ ఆహ్వానం మేరకు వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు ఒత్తిడిని తట్టుకునే […]

బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి

AISF రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF నాయకులు వినతిపత్రం అందజేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించి విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా AISF జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ తెలంగాణలో పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.9,300 కోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు […]

సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు

సుజాతనగర్ మండలం సర్వారాం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్పంచ్ తండాలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శుభ్రత పనులు నిర్వహించారు. సర్పంచ్ భూక్యా సునీత ఆదేశాల మేరకు డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా సర్పంచ్ పర్యవేక్షణలో 5వ వార్డులో డ్రైనేజీ పనులను పారిశుధ్య కార్మికులు పూర్తి చేశారు. గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం

అశ్వాపురం మండలం గొందిగూడెం బండ్ల సత్తయ్య గుంపు లో గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతి గదులు,టాయిలెట్ నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ చేశారు.అనంతరం పాఠశాలలో మినీ ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం కల్పించడంపై ఐటిడిఏ ఈఈ మధుకర్, ఏఈ ప్రసాద్‌లను ఎమ్మెల్యే అభినందించారు.