నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట
చుంచుపల్లి మండలం నంద తండా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున జయరాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఆదేశాలు,గ్రామస్తుల అండతో నామినేషన్ తర్వాత ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ప్రారంభించారు.జయరాం నాయక్ మాట్లాడుతూ.. నంద తండా ప్రజలకు నేను సుపరిచితుడిని,ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవలు చేస్తూ సామాన్యులకు సహాయం అందిస్తున్నాను.పార్టీ విధేయతతోనే పోటీ చేస్తున్నాను.గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే నంద తండాను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.గ్రామ అభివృద్ధిపట్ల తన కుటుంబం పదేళ్లుగా చూపుతున్న సేవా […]
గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న
స్థానిక గార్ల పట్టణ కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం శ్రేణులు కూడా పాల్గొని మహానుభావుడి స్ఫూర్తిని స్మరించారు. ఈ కార్యక్రమంలో లైవ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ రాజకుమార్ జాదవ్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు