జోనల్ స్థాయి క్రీడా పోటీలలో ఆశ్రమ ఉన్నత పాఠశాల కరకగూడెం విద్యార్థులు సత్తా చాటారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి ఆటల పోటీలలో ఎ హెచ్ ఎస్ కరకగూడెం విద్యార్థులు ఖో ఖో లో జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఎ హెచ్ ఎస్ కరకగూడెం విద్యార్థులు చరణ్, నర్సింహ రావు,సాయి కుమార్, సాయి చరణ్ తమ ఆటతీరును ప్రదర్శించి సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ ఎం మరియు సిబ్బంది అభినందనలు తెలిపారు.రాబోవు రోజుల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర క్రీడలలో సత్తా చాటాలని ఆకాంక్షించారు.
ధర్మారం సంపూర్ణంగా బంద్

బందులో పాల్గొన్న కాంగ్రెస్, బిఆర్ఎస్, భాజపా నాయకులు ధర్మారం (తెలంగాణ వాణి) బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం శనివారం రాష్ట్ర వ్యాప్త బందుకు బీసీ ఐకాస ఇచ్చిన పిలుపుమేరకు ధర్మారం మండల కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఉదయం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా కు చేరుకుని వ్యాపార వాణిజ్య ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను హోటళ్లను బందు చేయించారు. […]