బంద్ విజయవంతం చేయండి

బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% చట్టబద్ధ ప్రాతినిధ్యం కోసం బీసీ సంఘాలు పిలుపునిచ్చిన శనివారం బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు సాధన కోసం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని, హైకోర్టులో కేసు గెలిచి తీరుతామని దీమా వ్యక్తం చేశారు. కావున రేపటి […]
బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన తలపెట్టిన తెలంగాణ బంధుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లా నాయక్ తెలిపారు. రేపటి బంధు లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ […]
మృతుడి కుటుంబానికి మామిడి స్వామిరెడ్డి చేయూత

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) కొత్తూరు గ్రామంలో నెరువట్ల పెద్ద లచ్చయ్య తండ్రి బాలరాజు కొద్ది రోజుల క్రితం మృతిచెందగా, వారి కుటుంబానికి పంచాయతీరాజ్ రిటైర్డ్ ఈఈ మామిడి స్వామిరెడ్డి అండగా నిలిచారు. మృతుడు లచ్చయ్యది పూర్తిగా నిరుపేద కుటుంబం కావడంతో కొత్తూరు మాజీ ఎంపీటీసీ తాళ్లపెల్లి లింగయ్య గౌడ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మామిడి స్వామిరెడ్డిని కోరగా ఆయన వెంటనే స్పందించారు. లచ్చయ్య కుటుంబానికి స్వామిరెడ్డి తనవంతుగా 5 వేల రూపాయల ఆర్థిక […]
పశువులను తరలిస్తున్న కంటేనైర్ పట్టివేత

బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) సోనాల మండలం ఘన్పూర్ చెకపోస్ట్ దగ్గర పశువులను తరలిస్తున్న హెచ్ 55 డబ్ల్యూ 3900 వాహనం బోథ్ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. అందులో మొత్తం ఇరవై ఆరు పశువులు ఉన్నాయని అందులో నాలుగు చనిపోయాయని ఇరవై రెండు మూగజీవలను బజార్హత్నూర్ గోశాలకు తరలించడం జరిగిందని వీటిని తరలిస్తున్న నలుగురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం అని బోథ్ ఏస్ఐ సాయి తెలిపారు.
తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డు అందుకున్న షేక్ మాయ మస్తాన్

ఖమ్మం (తెలాంగాణ వాణి) మ్యాజిక్ కళా రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డును ఖమ్మం వాసి షేక్ మాయ మస్తాన్ అందుకున్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి 2025 -2026 అంతర్జాతీయ తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు హైదరాబాద్ శ్రీ త్యాగరాయ కళావేదిక లో జరిగాయి . ఈ అవార్డును తెలుగు వెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోజు రాజకుమార్ చార్యులు , తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ […]