రాజాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమూహ స్థాయి బాలమేళాలో అద్భుత ప్రతిభ కనబరిచి మూడు బహుమతులు సాధించారు.వి.విరుక్ష (మొదటి తరగతి) మొదటి బహుమతి,కె. స్మైలిక (ఐదవ తరగతి) మొదటి బహుమతి, వి. మనన్య రామ్ (రెండవ తరగతి) రెండవ బహుమతి సాధించి పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు. ఉపాధ్యాయులు రాంప్రసాద్,రాంబాబు సమర్థ మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పాఠశాల వర్గాలు తెలిపారు. విశేష కృషి చేసిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు స్థానిక ప్రజలు అభినందించారు.ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ పాఠశాల ఖ్యాతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
Post Views: 9