UPDATES  

NEWS

కాకతీయ కాలంనాటి శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట అలాంటి ఉపాధ్యాయులను తొలగించాల్సిందే..?? CM రేవంత్‌కు విద్యా కమిషన్ సూచన.! గిరిజన సంక్షేమ భాషా పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలి: టిపిటిఎఫ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలి: జిల్లా కార్యదర్శి ఎస్.శైలజ మైనర్,మానసిక రోగి పై అత్యాచారం, వ్యక్తికి 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి ఆహ్వానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) లీగల్,హ్యూమన్ రైట్స్ & ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా అడ్వకేట్ మారపాక రమేష్ కుమార్ నియామకం ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ.జయంతి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ అండ్ బి ఆర్ ఎస్ నాయకులు ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలి

 తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్ధినులకు సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారని వారి తల్లిదండ్రులు మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ కి ఫోన్ చేసి సమస్యలను వివరించగా వెంటనే అక్కడికి చేరుకున్నారు. విద్యాలయంలోని వంట గది మరియు విద్యార్థులు త్రాగే నీరు, తినే ఆహారాన్ని పరిశీలించారు. విద్యాలయంలో ప్రస్తుత దుర్బర పరిస్థితిని మరియు విద్యార్థినిలు తినే ఆహారం వారు వారి అవసరాలకు నిమిత్తం వాడే కలుషితరమైన నీటిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యమంత్రి & విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడని అన్నారు. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచాక అమెరికాలో తప్ప ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని సోషల్ మీడియాలో ఫోజులకు తప్ప నియోజకవర్గంలోని విద్యాసంస్థలపై అవగాహన లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి నియోజకవర్గం లోని అన్ని గురుకుల పాఠశాలలో పర్యటించి వారి సమస్యలను తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. లేని పక్షాన కలెక్టరేట్ ముట్టడి చేస్తామని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest