UPDATES  

 రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్‌లో తొలిసారిగా 45W ఫాస్ట్‌ ఛార్జింగ్, డ్యూయల్‌ స్పీకర్లు..!

రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లోకి ఏప్రిల్‌ 2వ తేదీన రియల్‌మి 12X 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme 12X 5G Smartphone Price) విడుదల కానుంది. ఈ సందర్భంగా సంస్థ కీలక ప్రకటన చేసింది.

కీలక ఫీచర్లు కలిగిన ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.12,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటన చేసింది. దీంతోపాటు స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలనూ వెల్లడించింది.

6.72 అంగుళాల డిస్‌ప్లే, కూలింగ్‌ టెక్నాలజీ.. :

రియల్‌మి 12X 5G స్మార్ట్‌ ఫోన్‌ (Realme 12X 5G Smartphone Specs) 6.72 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ సహా 950 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

 

దీంతోపాటు ఈ హ్యాండ్‌ సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటి 6100+ 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు VC కూలింగ్ టెక్నాలజీ తో లాంచ్‌ కానుంది. IP54 రేటింగ్‌తో వస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

45W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ :

దీంతోపాటు ఈ రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్‌ 45W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫలితంగా ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్ అందుబాటులోకి రానుంది. సంస్థ ప్రకారం కేవలం 30 నిమిషాల్లో 0-50 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చని తెలిపింది. ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

50MP కెమెరా, డ్యూయల్‌ స్పీకర్లు :

రియల్‌మి 12X 5G స్మార్ట్‌ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. అయితే మిగిలిన కెమెరా సహా సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ సెగ్మెంట్‌లో డ్యూయల్‌ స్పీకర్లు కలిగి ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ రియల్‌మి 12X 5G మాత్రమేనని సంస్థ తెలిపింది. దీంతోపాటు డైనమిక్‌ బటన్‌ మరియు ఎయిర్‌ గెశ్చర్స్‌ కూడా కలిగి ఉంటాయని సంస్థ తెలిపింది. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలిపింది.

విడుదల, సేల్ వివరాలు :

రియల్‌మి 12X 5G స్మార్ట్‌ ఫోన్ ఏప్రిల్ 2న తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. రియల్‌మి యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా విడుదల కార్యక్రమాన్ని లైవ్‌లో చూడవచ్చు. రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌ సైట్‌ మరియు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే సేల్‌ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest