తుకారం ఘథా పూజ నిర్వహించిన సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,
సంగారెడ్డి,కంగ్టి,జనవరి 09,( తెలంగాణ వాణి ప్రతినిధి )
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ రుక్మిణి పాండురంగ, ఆలయంలో వైష్ణవ సాంప్రదాయిక అఖండ హరినామ్ సప్తహ ముడవ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం దేహు నివాసి శ్రీ జగద్గురు తుకారం మహారాజ్ పంచమా వేదమైన తుకారం ఘథా పూజా కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, నిర్వాహకులు ఎలిశల హనుమంత్ రెడ్డి, కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్త తుకారాం 1608-1650 మహారాష్ట్రకు చెందిన 17వ శతాబ్దపు మహాభక్తుడు,కవి,భక్తి ఉద్యమ సాధువు, విఠోబా భక్తుడు, సమానత్వ సిద్ధాంతాన్ని ప్రబోధించారు;తన అభంగాలు (భక్తి గీతాల) ద్వారా సామాన్యులకు ఆధ్యాత్మికతను సులభతరం చేశారు, ఛత్రపతి శివాజీ సమకాలీనుడు.ఆయన జీవితం కష్టాలతో నిండినా,దేవునిపై అచంచలమైన భక్తితో, సామాజిక అసమానతలను ఖండిస్తూ,అందరూ దేవుడిని చేరుకోవచ్చని నిరూపించారు.
తుకారాం పూణే సమీపంలోని దేహూ గ్రామంలో జన్మించారు.
తండ్రి వ్యాపారంలో నష్టాలు రావడంతో, ఆయనకు పేదరికం, కరువు వంటి కష్టాలు ఎదురయ్యాయి.
మొదటి భార్య రఖుమాబాయి కరువుతో మరణించింది,రెండవ భార్య జిజాబాయి ఆయన భక్తిని అర్థం చేసుకోలేక వేధించేది.
భక్తి మార్గం,రచనలు
అన్ని ప్రాపంచిక వ్యవహారాలు విడిచిపెట్టి,తుకారాం విఠోబాపై పూర్తి భక్తితో జీవించడం ప్రారంభించారు.
జ్ఞానేశ్వర్,నామ్దేవ్ వంటి మహానుభావుల రచనల ప్రభావంతో, ఆయన అభంగాలు రాయడం మొదలుపెట్టారు.
తన అభంగాల ద్వారా, ప్రేమ,దయ,నిజాయితీ వంటి ఉన్నత విలువలను,విఠోబాను సులభమైన భాషలో కీర్తిస్తూ ప్రజలను దైవభక్తి వైపు నడిపించారు.
సామాజిక సంస్కరణలు
కులం,వర్గం,లింగ భేదం లేకుండా అందరినీ శిష్యులుగా స్వీకరించారు,సామాజిక సమానత్వాన్ని ప్రబోధించారు.
భక్తి మార్గంలో కిర్తన (సమూహ భజన) ను ప్రోత్సహించారు,ఇది ఆధ్యాత్మికతను అందరికీ అందుబాటులోకి తెచ్చింది.చివరి జీవితం
ఆయన జీవితంలో అనేక అద్భుత సంఘటనలు జరిగాయి,చివరికి విఠోబా స్వయంగా గరుడ వాహనంలో వచ్చి ఆయనను వైకుంఠానికి తీసుకెళ్లారని కథనాలు ఉన్నాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వహకులు వైష్ణవ సాంప్రదాయిక భజన మండలి,గ్రామ పెద్దలు, యువకులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

