స్థానిక ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో సర్ సి.వి. రామన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు,మోడళ్లను ప్రదర్శించి తమ సృజనాత్మకతను చాటుకున్నారు. శాస్త్ర విజ్ఞానం నిత్య జీవితంలో ఎంతో ఉపయోగ పడుతుందని ఉపాధ్యాయులు వివరించారు.సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య,డీజీఎం చేతన్ మాధుర్,ప్రిన్సిపాల్ నివేదిత,వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్తో పాటు అధ్యాపకులు,సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 11