UPDATES  

NEWS

రేగళ్ల గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తాండ్ర మధుకర్  ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో పట్టెడన్నం కార్యక్రమం ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత

 పిల్లలకు ప్లాస్టిక్ బాటిళ్లలో పాలు తాగిస్తున్నారా? అయితే ఇది ఒకసారి తెలుసుకోండి.

: చిన్న పిల్లలకు పాలు తాగించడానికి చాలా మంది ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తుంటారు. కొందరు వాటర్ ను కూడా తాగిస్తుంటారు. అయితే ఈ పద్ధతి మానుకోవాలి అంటున్నారు వైద్యులు.

వీటి వల్ల పిల్లల ఆరోగ్యానికి హానీ అంటున్నారు. సాధారణంగానే ప్లాస్టిక్ హానికరం అని తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తలు, ఆధారాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అయితే ఇది పిల్లలకు మరింత హాని చేస్తుందని తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోండి.

ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించడం మాత్రమే కాదు. వీటిని వేడి నీటితో శుభ్రం చేస్తారు కొందరు. కొన్ని సార్లు అదే బాటిల్ లో వేడి పాలను కూడా పోస్తారు. ఎందుకంటే వేడి నీటి వల్ల వైరస్, బ్యాక్టీరియా చనిపోతుందని వారి నమ్మకం. కానీ దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయట. ప్లాస్టిక్ బాటిళ్లను వేడి చేయడం వల్ల అందులోని మైక్రో ప్లాస్టిక్ లు పాలు, నీరు ద్వారా పిల్లల శరీరంలోకి వెళ్తాయని చెబుతున్నారు వైద్యులు. ఈ మైక్రో ప్లాస్టిక్ లు శిశువు కడుపు మెదడుకు హానీ చేస్తాయట.

ప్లాస్టిక్ బాటిళ్లను వేడి చేసినప్పుడు, లేదా వేడి నీటిని పోసినప్పుడు వాటి నుంచి బీపీఏ, Phthalates లు విడుదల అవుతాయట. దీని వల్ల పెరుగుతున్న పిల్లల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఈ ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి హానికరం అని చిన్నప్పటి నుంచి పుస్తకాలలో కూడా చదువుకుంటున్నాం. అలాంటివి పిల్లలకు మరింత హాని అంటున్నారు.

ప్లాస్టిక్ కు బదులు కొందరు సీసాలను కూడా వాడుతున్నారు. ఇందులో కూడా బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇక ప్లాస్టిక్ బాటిళ్లను తరచూ మార్చుదాం అనుకున్నా కూడా పర్యావరణానికి తీరని ముప్పు చేసిన వారు అవుతారు. అందుకే స్టీల్, గ్లాస్ బాటిళ్లను ఉపయోగించండి అని సలహా ఇస్తున్నారు వైద్యులు. మరి మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest