రేగళ్ల గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తాండ్ర మధుకర్
గిరిజన ఆశ్రమ పాఠశాల రేగళ్లను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తాండ్ర మధుకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల మరియు హాస్టల్‌లో ఉన్న సివిల్ వర్క్ సమస్యలను హెచ్ ఎం, బోధన సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువచ్చారు.వాటిని ప్రాజెక్ట్ అధికారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని మధుకర్ తెలిపారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులకు మెరుగైన మార్కులు సాధించేందుకు పలు సూచనలు చేశారు
ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో పట్టెడన్నం కార్యక్రమం
ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ కేంద్రంలో పట్టెడన్నం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ రుద్రోజు మోహన్, చుంచుపల్లి మండలం వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పాల్గొని పేదలకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మారుతి రత్నాకర్ మాట్లాడుతూ..పట్టెడన్నం కార్యక్రమం ద్వారా పేదలకు ఒక పూట అన్నం అందించడం ఎంతో మంచి కార్యక్రమమన్నారు. సంఘం సభ్యులు తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఈ […]