UPDATES  

NEWS

లక్ష్మీదేవిపల్లి లో సమీక్ష సమావేశం…పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంపీడీవో సుస్మితా

లక్ష్మీదేవిపల్లి మండలంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి సుస్మితా అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామాల్లో కొత్త నర్సరీల ఏర్పాటు,పారిశుద్ధ్య పనుల అమలు,మంచినీటి,పన్నుల వసూలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.సంబంధిత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్,వీరన్న,ఈ సి సత్యనారాణ,సెక్రెటరీ సాంబయ్య,వివిధ పంచాయతీ సెక్రటరీలు ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ చొరవతో పంచాయతీలో వెలిగిన దీపాలు..

పాల్వంచ : వీధులు చీకటిమయంగా లేకుండా, పిల్లలు,పెద్దలు, మహిళలు బయటకు వెళ్లాలంటే రాత్రి వేళ ఇబ్బంది లేకుండా ఉండుటకు పాల్వంచ మండలం కోడిపుంజుల వాగు గ్రామ పంచాయతీ సర్పంచ్ అజ్మీరా మహేశ్వరి శ్రీనివాస్ విధి దీపాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని విధి దీపాలను ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.