పసుపుకు మద్దతు ధర ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తాం

మార్కెట్ యార్డ్ ని సందర్శించిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ (తెలంగాణ వాణి) ఈనెల ఆఖరి వరకు పసుపు రైతులకు మద్దతు ధర 12 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పసుపు రైతులతో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.. ఈ మేరకు శనివారం పసుపు రైతులతో కలిసి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ని సందర్శించారు. పసుపు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె […]