జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పైన ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి మరణించారు. ఆయన స్వగ్రామమైన భువనగిరిలో జిటా బాలకృష్ణారెడ్డి అంతక్రియలు జరగనున్నాయి. జిట్టా బాలకృష్ణ మృతి పట్ల గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలుపుతున్నారు.