UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 తొలిసారి మిస్‌ యూనివర్స్‌ పోటీలో సౌదీ అరేబియా బ్యూటీ.. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..

స్లామిక్‌ దేశాలలో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశం. ఈ దేశం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అందాల పోటీల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే ఫ్యాషన్‌ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్‌ యూనివర్స్‌ 2024 అందాల పోటీలకు తొలిసారి సౌదీ అరేబియా పోటీ చేయనుంది.

దీంతో సౌదీ అరేబియావైపు ప్రపంచ దేశాలన్నీ తొంగి చూస్తున్నాయి. ఈ దేశానికి రూమీ అల్కహ్తాని (27) అనే మోడల్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ విషయాన్ని ఈ అందాల భామ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా సోమవారం (మార్చి 26) స్వయంగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మిస్‌ యూనివర్స్‌ పోటీలకు తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు రూమీ అల్కహ్తాని తన గ్లామరస్‌ ఫొటోలను కూడా షేర్‌ చేసింది. ఈ ఫొటోల్లో రూమీ స్ట్రాప్‌లెస్ సీక్విన్డ్ ఫ్రాక్‌ ధరించి కనిపించింది. ‘మిస్ యూనివర్స్ 2024 పోటీలో పాల్గొనడం నాకు గౌరవంగా ఉంది. మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా మొదటిసారి పాల్గొంటోంది’అని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అరబిక్‌లో రాసింది. దీంతో అంతర్జాతీయ వేదికగా జరిగే ఓ అందాల పోటీల్లో పాల్గొనే తొలి సౌదీ యువతిగా రూమీ అల్కహ్తాని చరిత్ర సృష్టించనుంది.

కాగా 73వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు ఈ ఏడాది సెప్టెంబర్‌ 28 మెక్సికో వేధికగా నిర్వహించనున్నారు. ఇందులో సౌదీ అరేబియా తొలిసారి పాల్గొంటోంది. రియాద్‌లో పుట్టి పెరిగిన రూమీ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో అధికారికంగా పాల్గొననుంది. అందాల పోటీల్లో పొల్గొనడం రూమీకి ఇదేం తొలిసారి కాదు. కొన్ని వారాల క్రితం మలేసియాలో నిర్వహించిన మిస్‌ అండ్‌ మిసెస్‌ గ్లోబల్‌ ఏసియన్‌ పోటీలోనూ ఆమె పాల్గొంది. సౌదీ అందాల తారలు అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొననప్పటికీ ఆ దేశంలో స్థానికంగా నిర్వహించే బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొంటారు. అలా నిర్వహించిన స్థానిక అందాల పోటీల్లో రూమీ మిస్‌ సౌదీ అరేబియా కిరీటాన్ని దక్కించుకుంది. అలాగే మిస్‌ అరబ్‌ వరల్డ్‌ పీస్‌ 2021, మిస్‌ వుమెన్‌ సౌదీ అరేబియా టైటిళ్లను కూడా దక్కించుకుంది. ఇప్పుడు ప్రపంచ వేదికపై మెరిసేందుకు సిద్ధమైంది.

 

 

కాగా గతేడాది మిస్‌ యూనివర్స్ 2024 కిరీటాన్ని నికరాగ్వాకు చెందిన మిస్ షెన్నిస్ పలాసియోస్ దక్కించుకుంది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్, ఆస్ట్రేలియాకు చెందిన మొరయా విల్సన్ నిలిచారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest