UPDATES  

 కిడ్నీలను క్లీన్‌ చేసే 6 ఆహారాలు ఇవే..

మన శరీరంలోని అనేక అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రోజూ అనుక విధులను నిర్వర్తిస్తుంటాయి. మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలతోపాటు శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వడబోసి బయటకు పంపిస్తుంటాయి.

ఈ క్రమంలో కిడ్నీలు నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. అందుకే వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ, మనం పాటించే పలు అలవాట్ల కారణంగా కిడ్నీల్లో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అవి కిడ్నీ స్టోన్స్‌గా మారుతున్నాయి. మరికొందరికి ఇన్ఫెక్షన్లుగా మారుతున్నాయి. ఇలా జరుగకుండా ఉండాలంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు కింది ఈ చిట్కాలను పాటించాలి.

– నీళ్లు సరిగా తాగకపోయినా కిడ్నీలు అనారోగ్యంంగా మారతాయి. కిడ్నీల్లో వ్యర్థాలు బయటకు పోవు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మొదట చేయాల్సిన పని రోజూ తగినంత నీళ్లు తాగాలి. రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. వేసవిలో అయితే 4 నుంచి 5 లీటర్లుల తాగాలి. ఎక్కువ నీళ్లు తాగితే వ్యర్థాలు బయటకు పోతాయి.

– కొత్తిమీర ఆకులు కిడ్నీలను శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే సమ్మేళనాలు కిడ్నీలను క్లీన్‌ చేస్తాయి. రోపూ ఉదయాన్నే పరగడుపున 30 ఎంఎల్‌ మోతాదులో కొత్తిమీర జ్యూస్‌ తాగాలి. వారంలో కనీసం 3 సార్లు తాగడం వలన కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి. ఆరోగ్యంగా మారతాయి. కిడ్నీ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. కొత్తిమీర జ్యూస్‌తో ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్, షుగరల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

– ఇక రోజూ ఉదయం ఒక కప్పు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వలన కూడా కిడ్నీలు శుభ్రంగా మారతాయి. బీట్‌టూర్‌ జ్యూస్‌ తాగడం వల్ల రక్తం పెరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది. అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

– నిత్యం గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఉదయం పరగడుపునే తీసుకోవాలి. దీనివల్ల కూడా కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

– గుమ్మడి విత్తనాలు రోజువారీ ఆహారంలో తీసుకోవడం వలన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

– కిడ్నీల ఆరోగ్యానికి అల్లం రసం బాగా పనిచేస్తుంది. రోజూ పరగడుపునే ఒక టీస్పూన్‌ అల్లం రసం సేవిస్తే కిడ్నీలు వాపు రాకుండా ఉంటాయి.

మద్యం ప్రభావంతో..
మద్యం సేవించడం, పొగ తాగడం వలన వాటి ప్రభావం కిడ్నీలపై పడుతుంది. ఈ అలవాట్లు ఉంటే మానుకోవడం మంచింది. బీపీ, షుగర్‌ ఉన్నవారు కూడా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే కిడ్నీలు ప్రభావితం అవుతాయి. దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను కూడా నియంత్రణలో ఉంచుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

నీళ్లు ఎక్కువగా తాగాలి..
కిడ్నీ సమస్యలు రాకుండా ఉండడానికి ఎక్కువగా నీళ్లు తాగాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక బరువు ఉన్నవారు తగ్గే ప్రయత్నం చేయాలి. బరువు సరిగా ఉన్నవారు పెరగకుండా చూసుకోవాలి. దీంతో కిడ్నీలను సంరక్షించుకోవచ్చు.

స్టోన్స్‌ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి…
కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్నవారు పలు ఆమారాలకు దూరంగా ఉండాలి. చాక్లెట్స్, బెండకాయలు, చిలగడ దుంపలు, నువ్వులు, పాలకూర వంటి ఆహారాలు తీసుకోకూడదు. వీటిని ఆహా

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest