UPDATES  

NEWS

ఏసీబీకి పట్టుబడ్డ మెట్‌పల్లి ఐసిడిఎస్ సిడిపిఓ పాడి పశువులు గొర్రెలు మేకలకు బీమా కల్పించడం హర్షణీయం గొర్రెలు, మేకల బీమా పథకం ప్రారంభం శాంతియుత వాతావరణంలో గణేష్ నిమర్జనం జరుపుకోవాలి: ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పౌష్టికాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల పిడుగుపాటుతో మహిళా వృద్ధురాలి మృతి వినాయక నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి గణనాథున్ని దర్శించుకున్న ఎన్నారై హరీష్ రెడ్డి ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా 200 స్టీల్ ప్లేట్లు విరాళం అత్యవసర సమయంలో రక్తదానం చేసిన బాచికి యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి జుబ్బు అభినందనలు

 టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ – కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్

టాలీవుడ్ ప్రముఖ నటుడు నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddarth) శుక్రవారం టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కాగా, టీడీపీ చీరాల అభ్యర్థి కొండయ్య యాదవ్ అల్లుడు నిఖిల్. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున నిఖిల్ ప్రచారం నిర్వహించనున్నారు. కాగా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరో నిఖిల్.. తరచూ సామాజిక బాధ్యతతో కొన్ని పోస్టులు పెడుతుంటారు. ఆయన ప్రచారం ఎన్నికల్లో ప్లస్ అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అభిమానులు, శ్రేణులు, కార్యకర్తల్లో జోష్ నింపనున్నారు.

‘టీడీపీకి కృతజ్ఞతలు’

తన కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు టీడీపీకి నిఖిల్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘టీడీపీ తరఫున చీరాల టికెట్ దక్కించుకున్న మా మామయ్య కొండయ్య యాదవ్ కు శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి.’ అంటూ నిఖిల్ ట్వీట్ లో పేర్కొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 30 March 2024, 12:59 am Posted by : TELANGANA VANI

టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ – కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్

టాలీవుడ్ ప్రముఖ నటుడు నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddarth) శుక్రవారం టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కాగా, టీడీపీ చీరాల అభ్యర్థి కొండయ్య యాదవ్ అల్లుడు నిఖిల్. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున నిఖిల్ ప్రచారం నిర్వహించనున్నారు. కాగా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరో నిఖిల్.. తరచూ సామాజిక బాధ్యతతో కొన్ని పోస్టులు పెడుతుంటారు. ఆయన ప్రచారం ఎన్నికల్లో ప్లస్ అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అభిమానులు, శ్రేణులు, కార్యకర్తల్లో జోష్ నింపనున్నారు.

'టీడీపీకి కృతజ్ఞతలు'

తన కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు టీడీపీకి నిఖిల్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 'టీడీపీ తరఫున చీరాల టికెట్ దక్కించుకున్న మా మామయ్య కొండయ్య యాదవ్ కు శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి.' అంటూ నిఖిల్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest