UPDATES  

 ఖాళీ కడుపుతో తినదగిన ఉత్తమ ఆహారాలు ఇవే

ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినే ఆహారం శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా చలాకీగా వుండేట్లు చేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో తినే ఆహారం తేలికగా జీర్ణమవదగినదిగా వుండాలి.
అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే అది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.

చియా గింజల్లో ప్రొటీన్లు ఉండటం వల్ల ఎక్కువ కాలం ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

బొప్పాయి ఆస్తమాను నిరోధిస్తుంది, ఎముకల బలానికి తోడ్పడుతుంది, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.

ఖాళీ కడుపుతో కలబంద రసం తీసుకోవడం వల్ల శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest